ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ‘సలార్’ మూవీ భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా దక్షిణాది భాషల్లో.. డిస్నీ+హాట్స్టార్లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీలో ఈ సినిమా 300 రోజుల నుంచి టాప్లో ట్రెండవుతోంది. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. కాగా.. రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నిర్మించింది.