SKLM: శ్రీకాకుళంలోని డీఎల్టీసీ-ఐటీఐలో ఈనెల 19న అప్రెంటిస్ మేళా జరగనుందని డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై రామ్మోహన్ రావు మంగళవారం తెలిపారు. ఓ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వహించే ఈ మేళాకు ఐటీఐలో వెల్డర్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్లలో ఉత్తీర్ణులైన 25సం.లోపు వయసు కలిగినవారు అర్హులన్నారు.