అల్లరి నరేష్-సుబ్బు మంగదేవి కాంబోలో తెరకెక్కుతున్న బచ్చలమల్లి సినిమా ఈ నెల 20 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు హాజరైన యువ హీరో కిరణ్ అబ్బవరం అల్లరి నరేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎన్నో విభిన్న రోల్స్ చేసిన నరేష్‌కు స్టార్ ట్యాగ్ ఇవ్వాలని అతని అభిమానిగా కోరుకుంటున్నానని అన్నాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నానని పేర్కొన్నాడు.