మతిమరుపు, పార్కిన్సన్స్ లాంటి నరాల వ్యాధులు వృద్ధాప్యంలో రాకుండా ఉండటానికి ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజిస్ట్ ప్రియాంక సూచనలు చేశారు. ఏ వయసువారైనా బ్రేక్ ఫాస్ట్ చేయకుండా ఖాళీ కడుపుతో ఉండకూడదన్నారు. బ్రేక్ ఫాస్ట్ లేకుంటే రోగనిరోధక శక్తి తగ్గి, తలనొప్పి, ఇతర నరాల సమస్యలు వస్తాయన్నారు. నిద్రలేమి కారణంగా మెదడులో కణాలు క్రమంగా నశిస్తాయని, కనీసం 7-8 గంటలు నిద్రపోవాలని, రోజూ అరగంటపాటు ఆగకుండా నడవాలని సూచించారు.