Kcr ఇప్పుడు గుర్తుకొచ్చరా? కార్యకర్తలకు ఆత్మీయ సందేశంపై షర్మిల విసుర్లు
YS Sharmila:తెలంగాణ సీఎం కేసీఆర్పై (cm kcr) వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిన్న కార్యకర్తలకు ఆత్మీయ సందేశం ఇచ్చిన సంగతి తెలిసిందే. దానికి షర్మిల ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు.
‘రైతులు ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్న సమయంలో.. ఉద్యమ కారులకు అన్యాయం జరిగిన సమయంలో.. మీ పార్టీ సర్పంచులు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్న సమయంలో.. ఏ రోజైనా ఆత్మహత్య చేసుకోకండి అని లెటర్ రాసావా? ఇప్పుడు బిడ్డ జైలుకు పోయే సమయం వచ్చే సరికి కేసీఆర్కు కార్యకర్తలు గుర్తుకు వచ్చారు. కార్యకర్తల బలం గుర్తుకు వచ్చింది. తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చింది. ఆత్మీయ సందేశం అని ..మొసలి కన్నీరు కారుస్తూ ఓపెన్ లెటర్లు రాస్తున్నారు’ అని షర్మిల ఆగ్రహాం వ్యక్తం చేశారు.
ఎవడు చస్తే నాకేంటని .. వెంట నడిచినోళ్ళను .. వెన్నంటి ఉన్నోళ్లను వెన్ను పోటు పొడిచావ్ .. సకల జనులను మోసం చేసావ్ .. కానీ ఇప్పుడు నీ పీఠం కదులుతుందని .. లిక్కర్ మరకల్లో బిడ్డ జైలుకు పోతుందని .. పేపర్ లీకేజి వ్యవహారం అధికార శాపం అయ్యేసరికి .. ఎన్నికలు వస్తున్నాయని ..1/4
కేసీఆర్ (kcr) ఎన్ని లెటర్లు రాసిన .. ఎన్ని కుప్పిగంతులు వేసినా .. లాభం లేదు. పాపం పండింది.. వచ్చే ఎన్నికల్లో ఆ పాపానికి పరిహారం చెల్లించుకోక తప్పదు.. కుటుంబంతోపాటు జైలుకు పోవుడే అని షర్మిల (YS Sharmila) స్పష్టంచేశారు.