Telangana High Court:జేఎల్ (జూనియర్ లెక్చరర్) (jl) నియామక పరీక్షకు సంబంధించి హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పేపర్-2 ప్రశ్నాపత్రం తెలుగులోనే ఇవ్వాలని స్పష్టంచేసింది. ఈ పేపర్ ఇంగ్లీషులోనే (english) ఇవ్వాలరి కమిషన్ అనుకుంది. టీఎస్ పీఎస్సీ (tspsc) నిర్ణయాన్ని హైకోర్టు (high court) ధర్మాసనం తప్పుపట్టింది. ఇష్టానుసారంగా పరీక్షలు నిర్వహించడం సరికాదని హైకోర్టు (high court) ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో అభ్యర్థులకు మేలు జరగనుంది. కొశ్చన్ పేపర్ ఇంగ్లీషులోనే ఇస్తే.. తెలుగు మీడియంలో చదువుకున్న వారు ఇబ్బంది పడే అవకాశం ఉంది.
ఇటీవల పేపర్ లీకేజ్ (paper leak) అంశం దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కుమార్ (praveen kumar), రాజశేఖర్ రెడ్డి (rajashekar reddy) అనే ఉద్యోగులు లీకేజీకి పాల్పడ్డారు. వారిని అరెస్ట్ చేసి.. కీలక సమాచారం రాబట్టారు. మొత్తం 5 పేపర్లు (5 papers) ప్రవీణ్ (praveen) పెన్ డ్రైవ్లో ఉన్నాయని సిట్ గుర్తించింది. లీకేజీ వెనక ఎవరూ ఉన్న వదలం అని ఇటీవల మంత్రి కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి బీజేపీ కార్యకర్త అని తెలిపారు. దాంతోపాటు నోటిఫికేషన్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన కామెంట్లను కూడా ప్రస్తావించారు.
ప్రవీణ్ కుమారు స్త్రీ లోభి అని.. తప్పులను సరిదిద్దుకునేందుకు కమిషన్కు వచ్చిన మహిళల నంబర్లు తీసుకునేవాడట. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నాడట.. మరికొందరినీ వీడియో కాల్ మాట్లాడాలని వేధించేవాడని తెలిసింది. పేపర్ లీకేజీ ఘటనలో రేణుక పాత్ర కూడా ఉందని తేలింది.