»Free Electricity Monthly Allowances For Graduates Rahul Gandhi
Rahul Gandhi కర్ణాటకలో వరాలు.. ఉచిత విద్యుత్, గ్రాడ్యుయేట్లకు భృతి
Rahul Gandhi:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ- కాంగ్రెస్ ఫోకస్ చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ (bjp).. ఈ సారి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ (congress) అనుకుంటున్నాయి. ఆ మేరకు జనాలతో మమేకం అవుతున్నారు. ఈ రోజు కర్ణాటక (karnataka) బెళగావిలో రాహుల్ గాంధీ (rahul gandhi) పర్యటించారు. ప్రచారంలో భాగంగా.. కీలక ప్రకటన చేశారు.
Free electricity, monthly allowances for graduates: Rahul Gandhi
Rahul Gandhi:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ- కాంగ్రెస్ ఫోకస్ చేశాయి. మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ (bjp).. ఈ సారి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ (congress) అనుకుంటున్నాయి. ఆ మేరకు జనాలతో మమేకం అవుతున్నారు. ఈ రోజు కర్ణాటక (karnataka) బెళగావిలో రాహుల్ గాంధీ (rahul gandhi) పర్యటించారు. ప్రచారంలో భాగంగా.. కీలక ప్రకటన చేశారు.
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. నిరుద్యోగ యువతను ఆకర్షించేందుకు భృతి ఇస్తామని చెప్పారు. డిగ్రీ (graduates) చేసిన వారికి నెలకు రూ.3 వేలు, డిప్లోమా చేసినవారికి నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. ఉద్యోగాల కల్పనలో బీజేపీ (bjp) విఫలమయ్యిందని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్ర (bharat jodo yatra) సమయంలో యువత తనవద్దకొచ్చి.. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించడం లేదని చెప్పారు.
ఐదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు (10 lakhs jobs) కల్పిస్తామని రాహుల్ గాంధీ (rahul gandhi) స్పస్టంచేశారు. పురుషులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తామని.. తొలి రెండున్నరేళ్లలో 2.5 లక్షల ఉద్యోగాలు.. తర్వాత మిగిలిన ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. . దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి 10 కిలోల బియ్యం.. 2 వేల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. మహిళలకు రూ.2 వేల అందజేస్తామన్నారు.
ఈ దేశం అందిరికీ చెందినది.. కొందరికే కాదని చెప్పారు. అదానీ (adani), ఇంకొకరికో కాదని చెప్పారు. రైతులు, కార్మికులు, పేదలు అందరికీ తెలుసు అని చెప్పారు. మైసూర్ శాండల్ సోప్ కార్పొరేషన్ స్కాండల్కు సంబంధించి ఇప్పటివరకు ఏమీ చర్యలు తీసుకోలేదని చెప్పారు. జాబ్ కోసం బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు రూ.కోట్లు తీసుకున్నా ఎలాంటి చర్యలు లేవన్నారు.