NRPT: జిల్లా కేంద్రంలోని శ్రీ చిట్టెంనర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేడు ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. వివిధ ప్రతిష్టాత్మక కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు నిరుద్యోగ యువతీయువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ మెర్సీ వసంత ఓ ప్రకటనలో కోరారు.