2024లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ (EV) సేల్స్ భారీగా జరిగాయి. ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా ఓలా నంబర్-1గా కొనసాగుతుంది. ఈ సంవత్సరంలో కంపెనీ రిటైల్ విక్రయాల సంఖ్య 4 లక్షల యూనిట్లను దాటింది. 2024 డిసెంబరన్ 15వ తేదీ వరకు లేటెస్ట్ వాహన డేటా ప్రకారం ఓలా మొత్తం 4,00,099 యూనిట్లను విక్రయించింది. సెప్టెంబర్ 9న ప్రపంచ EV దినోత్సవం సందర్భంగా కంపెనీ 3 లక్షల యూనిట్ల మైలురాయిని సాధించింది.