అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప’ సినిమా విడుదలై నేటికి మూడేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఓ పోస్టర్ విడుదల చేసింది. కాగా, ‘పుష్ప’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక హిందీతో పాటు ఇతర భాషల్లో మాసివ్ క్రేజ్ సంపాదించుకుంది. మూడేళ్ల తర్వాత వచ్చిన పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1409 కోట్లు (గ్రాస్) వసూలు చేసింది.