ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడితో మాట్లాడారు. యూఏఈపై దాడులను మోదీ తీవ్రంగా ఖండించారు. అలాగే, దాడుల్లో మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. యూఏఈకి భారత్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉద్రిక్తతలను తగ్గించడం, ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని సమర్థిస్తామని వెల్లడించారు.