హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో ‘ముఫాసా: ది లయన్ కింగ్’ ఒకటి. ఇందులో కీలకమైన ‘ముఫాసా’ పాత్రకు తెలుగులో మహేశ్‌బాబు డబ్బింగ్ చెప్పడంపై సితార మాట్లాడుతూ..‘ముఫాసాకి నాన్న డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉంది. ముఫాసా మాదిరిగా నిజ జీవితంలోనూ నాన్న చాలా ప్రేమ చూపిస్తారు’ అని చెప్పారు.