KKD: ఉప్పాడ సముద్రతీరం ప్రకృతి అందాలకు నిలయం. ఈ సముద్రతీరం విశాలమైన పసిడి ఇసుక తిన్నెలతో, నీలిరంగు అలల హోరుతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో తీరప్రాంతం నీలిరంగు వర్ణంతో మరింత అందాన్ని సంతరించుకుంది. ఉప్పాడ తీరంలోని ప్రశాంతమైన వాతావరణంలో సముద్రపు హోరులో పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తూన్నారు.