మలయాళ సూపర్ హిట్ మూవీ ‘ముర’ OTTలోకి రాబోతుంది. నవంబర్ 8న విడుదలై భారీ విజయం అందుకున్న ఈ సినిమా ఈ నెల 20 లేదా 25 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. ఇక ముహమ్మద్ ముస్తఫా తెరకెక్కించిన ఈ సినిమాలో హృదు హరూన్, సూరజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.