కృష్ణా: నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ఆ బిడ్డలకు భారమైంది. వృద్ధాప్యంలో అన్నీ తామై చూసుకోవల్సిన బిడ్డలే ఆ తల్లిని కాదనుకుని నిర్ధాక్షిణ్యంగా అర్ధరాత్రి నడి రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. నడిరోడ్డుపై ఉన్న ఆ వృద్ధురాలిని చూసిన స్థానికులు పోలీసుల సహకారంతో గన్నవరంలోని PKR వృద్ధాశ్రమంలో చేర్పించారు.