VZM: గంట్యాడ మండలం మోకాలుపాడులో 2014-2019 సంవత్సరంలో నిర్మించిన మరుగుదొడ్లకు నిర్వహణ కొరవవడంతో అధ్వానంగా మారాయి. వీటిని సమర్థవంతంగా నిర్వహించి వాడుకలోకి తీసుకురావాలని అధికారులు ఆదేశాలు ఇచ్చినప్పటికీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలా మారిపోయాయని స్థానికులు ఆరోపించారు. అధికారులు తగు చర్యలు తీసుకుని ప్రజాధనం వృధా కాకుండా చూడాలని కోరుతున్నారు.