ELR: దెందులూరు నియోజకవర్గ పరిధిలో నిర్మాణం అవుతున్న మిని గోకులం షెడ్లపై అధికారులతో సోమవారం రాత్రి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సమీక్ష నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మినీ గోకులం షెడ్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. వీటి ద్వారా పశుపోషణ చేసుకునే రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.