చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. కొన్ని ఫేస్ ప్యాక్స్ ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అరటిపండు గుజ్జులో తేనె, పెరుగు కలిపి చర్మంపై అప్లై చేసుకుని 20-30 నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. శనగపిండిలో టమాటా రసం, కాస్త రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇది స్క్రబ్‌లా పనిచేసి చర్మంపై మృతకణాలని తొలగిస్తుంది. చర్మానికి తేమ అందించి, మృదువుగా మారుస్తుంది.