ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’ భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా OTT అప్డేట్ వచ్చింది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 9 నుంచి సదరు సంస్థలో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.