‘విలంగ్’ ఫేమ్ పాండియరాజ్ దర్శకత్వంలో తను కొత్త సినిమాను చేస్తున్నట్లు తమిళ నటుడు సూరి ప్రకటించారు. ‘నా తర్వాతి మూవీగా ‘మామన్’ను ఫైనల్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి పూజా కార్యక్రమం ఇవాళ జరిగింది. అప్డేట్స్ కోసం వేచి చూడండి’ అంటూ Xలో పోస్ట్ చేశారు. దీనికి పాపను ఎత్తుకున్న ఫొటోను జత చేశాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని లార్క్ స్టూడియో బ్యానర్‌పై కుమార్ నిర్మిస్తున్నారు.