దేశవ్యాప్తంగా పుష్ప-2 మానియా ఇప్పట్లో తగ్గేలా లేదు. నానాటికి ఈ చిత్రం కొత్త రికార్డులను సెట్ చేస్తోంది. విడుదలైన 11 రోజుల్లోనే రూ.1,409 కోట్లను కొల్లగొట్టింది. ఒక్క హిందీలోనే రూ.561 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి ఏ డబ్బింగ్ సినిమా రాబట్టలేని వసూళ్లను సాధించింది. ఈ మూవీ కన్నడ చిత్రం కేజీఎఫ్-2 లైఫ్ టైమ్ కలెక్షన్ను కేవలం 10 రోజుల్లోనే అధిగమించడం విశేషం.