VZM: గ్రామాల అభివృద్ధిలో గ్రామస్తులను భాగస్వామ్యం చెయాలని ఎంపీడీవో ఇప్పలవలస సురేష్ కోరారు. చీపురుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సర్పంచ్లకు, మండల స్థాయి అధికారులకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సోమవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి సాధించవచ్చన్నారు.