ప్రకాశం: దేవాలయాల్లో చోరీ చేసే దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ దామోదర్ చెప్పారు. ఒంగోలులో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాగులుప్పలపాడు మండలం నిడమానూరు, చదలవాడలోని గుళ్లలో వెండి వస్తువులను సిపన్య, ఈశ్వర్, శ్రీకాంత్ చోరీ చేసి కాకినాడ కృష్ణారావుకు అమ్మారు. కృష్ణారావు రైలులో చెన్నై వెళుతుండగా అదుపులోకి తీసుకుని చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు.