సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటుడు సుమన్ స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ చాలా తప్పు అని అన్నారు. సినిమా రిలీజ్ అయితే థియేటర్ వాళ్లు హీరోని పిలుస్తారని తెలిపారు. అభిమానుల రద్దీని, ఆ క్రౌడ్ని థియేటర్ వాళ్లు మేనేజ్ చేయాల్సిందన్నారు. తమ లాంటి నటులందరికీ ఇది ఒక హెచ్చరిక అని పేర్కొన్నారు.