Bunny : అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ దుమ్ముదులిపేశాయి. బన్నీకి పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు.. అల్లు అర్జున్ ఫర్పార్మెన్స్కు ఫిదా అయిపోయారు.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్‌గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా పుష్పరాజ్ డైలాగ్స్, దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ దుమ్ముదులిపేశాయి. బన్నీకి పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. ముఖ్యంగా బాలీవుడ్ జనాలు.. అల్లు అర్జున్ ఫర్పార్మెన్స్కు ఫిదా అయిపోయారు. అందుకే పుష్ప సెకండ్ పార్ట్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టే భారీగా తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. ఏకంగా 400 కోట్లు ఖర్చు చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. ఇప్పటికే ఒకటి, రెండు షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసేశారు. తాజాగా హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఈ షెడ్యూల్లో రష్మిక, అల్లు అర్జున్, పహాద్ ఫాహద్ ఫాజిల్ పాల్గొన్నారు. త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పుష్ప2పై భారీ అంచనాలున్నప్పటికీ.. దాన్ని డబుల్ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు సుకుమార్. అలా చేయాలంటే.. టీజర్ లేదా ట్రైలర్ రిలీజ్ చేయాలి. అందుకే ఇప్పటి వరకు కనీసం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకుండా.. ఏకంగా టీజర్ రిలీజ్ ప్లానింగ్‌లో ఉన్నాడట మన లెక్కల మాస్టారు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు ఉంది. ఆ రోజు సాలిడ్ ట్రీట్ ఇవ్వాలని భావిస్తున్నారట. అయితే టీజర్ అంటే.. ఏదో 30 సెకండ్స్, నిమిషమో అనుకునేరు.. దాదాపు మూడు నిమిషాల నిడివితో ఉండే.. హై ఓల్టేజ్ యాక్షన్ పార్ట్‌కి సంబంధించిన టీజర్ అని తెలుస్తోంది. ఇప్పటికే టీజర్ వర్క్ స్టార్ట్ అయిందనే టాక్ నడుస్తోంది. అంతేకాదు టీజర్ కట్ కంప్లీట్ అయ్యి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ కూడా జరుగుతుందని సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోను పుష్ప2 పై భారీ హైప్ క్రియేట్ అయ్యేలా.. ఈ టీజర్‌ను కట్ చేస్తున్నారట. అందుకోసమే స్పెషల్‌గా కొన్ని షాట్స్ షూట్ చేశారట. ఇప్పటికే పుష్ప2కి వెయ్యి కోట్ల ఆఫర్ వచ్చిందనే టాక్ ఉంది. కాబట్టి.. టీజర్ ఓ రేంజ్లో ఉంటుందనడంలో ఎలాంటి సందేహాలు లేవు. మరి దీనిపై క్లారిటీ రావాలంటే.. ఏప్రిల్ 8వరకు వెయిట్ చేయాల్సిందే.