బాలీవుడ్లో పార్టీ కల్చర్ ఎక్కువగా ఉంటుందని నటుడు మనోజ్ బాజ్పేయీ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీలకు హాజరు కావడం తనకు పెద్దగా ఆసక్తి ఉండదని తెలిపారు. రాత్రి 10 గంటలకల్లా తాను నిద్రలోకి జారుకుంటానని.. తెల్లవారుజామునే నిద్రలేవడం తనకు ఇష్టమని చెప్పారు. అందుకే తాను పార్టీలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు.