టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ 12వ మూవీ ‘లైలా’. ఈ మూవీలో అతడు లేడీ గెటప్‌లో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.