పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓ సినిమా షూటింగ్లో గాయపడ్డారు. వచ్చే నెల 3వ తేదీన జపాన్‌లో విడుదలయ్యే ‘కల్కి’ ప్రమోషన్లకు తాను హాజరుకావడం లేదని వెల్లడించారు. ఓ మూవీ షూటింగ్ చిత్రీకరణ సమయంలో తన చీలమండ బెనికిందని, అందుకే వెళ్లలేకపోతున్నానని ప్రభాస్ ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్స్‌లో పాల్గొంటుందని తెలిపారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్ చేస్తున్నారు.