టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న సినిమా ‘కన్నప్ప’. ఈ మూవీ నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఫస్ట్ లుక్ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ చిత్రంలో ఆయన విజయుడిని గెలిచిన కిరాత పాత్రలో నటిస్తున్నట్లుగా వెల్లడించారు. కాగా, ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.