కోలీవుడ్ దర్శకుడు అట్లీ లుక్‌పై బాలీవుడ్ కమెడియన్ కపిల్ శర్మ అవమానించేలా వ్యవహరించాడు. కపిల్ శర్మ నిర్వహిస్తున్న ఓ షోలో అట్లీ పాల్గొన్నాడు. అయితే.. కథ చెప్పడం కోసం ఎవరినైనా స్టార్ హీరోను మీరు కలిసినప్పుడు.. వాళ్లు అట్లీ ఎక్కడ అని అడుగుతారా? అని ప్రశ్నించాడు. దీనిపై అట్లీ తనదైన స్టైల్లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. టాలెంట్ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది ముఖ్యం కాదని రిప్లై ఇచ్చాడు.