106 రోజులుగా రసవత్తరంగా సాగిన తెలుగు బిగ్‌బాస్ సీజన్ 8 ముగిసింది. ఈ సీజన్ విన్నర్‌గా సీరియల్ యాక్టర్ నిఖిల్ నిలిచాడు. మొత్తం 22 మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా గౌతమ్, నిఖిల్, ప్రేరణ, నబీల్, అవినాష్‌లు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నారు. ఈ ఉత్కంఠ పోరులో నిఖిల్ విజేతగా.. గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. విన్నర్ నిఖిల్ ఛీఫ్గెస్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా టైటిల్ అందుకున్నాడు.