తన కుటుంబంపై హత్యకు కుట్ర పన్నారని నటుడు మంచు మనోజ్ ఆరోపించారు. ‘జనరేటర్లో చెక్కర కలిపి డీజిల్ పోశారు. తద్వారా విద్యుత్ సరఫరాలో భయంకరమైన హెచ్చుతగ్గులు జరిగాయి. మా అమ్మ, తొమ్మిది నెలల పాప, బంధువులు ఇంట్లో తీవ్ర ఇబ్బంది పడ్డారు. నేను, నా భార్య ఇంట్లో లేని సమయంలో విష్ణుతో పాటు ఆయన అనుచరులు కలిసి కుట్ర పన్నారు. దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను’ అని పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు.