ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. మెగాస్టార్ చిరంజీవిని కలిసిన అనంతరం నాగబాబు నివాసానికి వెళ్లాడు. తన ఇంటికి విచ్చేసిన అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతులకు నాగబాబు సాదర స్వాగతం పలికారు. అనంతరం వారు కాసేపు ముచ్చటించారు. సంధ్య థియేటర్ ఘటనను, కేసు వివరాలను బన్నీ నాగబాబుకు వివరించాడు. కష్ట సమయంలో మెగా ఫ్యామిలీ అండగా నిలవడం పట్ల బన్నీ కృతజ్ఞతలు తెలియజేశాడు.