అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన మూవీ ‘పుష్ప 2 ది రూల్’. ఈనెల 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. 10 రోజుల్లోనే హిందీ మార్కెట్లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.507.50 కోట్లు (కేవలం హిందీ మార్కెట్) వసూలు చేసింది. హిందీలో వేగంగా రూ.500 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన చిత్రంగా ఇది రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేసింది.