తమిళ నటుడు విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల 1’ సినిమాకు సీక్వెల్గా ‘విడుదల 2’ రాబోతుంది. ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో దీని విడుదలకు ముందు ‘విడుదల 1’ను OTTలో ఫ్రీగా చూడొచ్చని ‘జీ5’ ప్రకటించింది. ఈ ఛాన్స్ ఈ నెల 20 వరకు మాత్రమే ఉంటుందని తెలిపింది. ఇక దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించిన ఈ సినిమాకు ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నారు.