మంచు విష్ణు(manchu vishnu) డబుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడా అంటే.. ఔననే తెలుస్తోంది. మధ్యలో అసలు ఆ ప్రాజెక్ట్ ఉండదని వినిపించగా.. ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. కొంత గ్యాప్ తర్వాత జిన్నాగా ప్రేక్షకుల ముందుకొస్తున్న విష్ణు.. డబుల్ డోస్ సిద్దమవుతున్నట్టు చెప్పుకొచ్చాడు. దీపావళి కానుకగా అక్టోబర్ 21న జిన్నా రిలీజ్ కానుంది. కొత్త దర్శకుడు ఈశాన్ సూర్య డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో.. పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ క్రమంలో ఢీ సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చాడు విష్ణు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2007లో యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ‘ఢీ’ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో కొన్నాళ్ల క్రితం ఈ సినిమాకు సీక్వెల్‌ను ప్రకటించారు. ‘ఢీ అండ్ ఢీ’.. డబుల్ డోస్ అనే క్యాప్షన్‌తో టైటిల్ కూడా అనౌన్స్ చేశారు.
అయితే మధ్యలో ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్టేట్ లేకపోవడంతో.. అటకెక్కినట్టేనని అనుకున్నారు. కానీ జిన్నా ప్రమోషన్లో ఈ ప్రాజెక్ట్ గురించి క్లారిటీ ఇచ్చాడు విష్ణు. 2023 చివర్లో ఈ సినిమా రెగ్యులర్ షూట్‌ను మొదలయ్యే ఛాన్స్ ఉందని తెలిపాడు. త్వరలోనే ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. అయితే గత కొంత కాలంగా శ్రీను వైట్లకు సరైన సక్సెస్ లేదు. అందుకే ఢీ సీక్వెల్ కూడా ఆగిపోయింది. మరి ఈ సారైనా ఢీ అంటే ఢీ పట్టాలెక్కుతుందేమో చూడాలి.