Ram Charan : ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్నింగ్ తర్వాత.. ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ ఇద్దరు ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కూడా ఆస్కార్ తర్వాత ఒకే రోజు మీడియా ముందుకొచ్చారు. ఎన్టీఆర్ 'ధమ్కీ' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రాగా.. చరణ్ ఢిల్లీలో India Today Conclave ప్రోగ్రామ్‌కి హాజరయ్యాడు.
ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ ఆస్కార్ విన్నింగ్ తర్వాత.. ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ ఇద్దరు ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు కూడా ఆస్కార్ తర్వాత ఒకే రోజు మీడియా ముందుకొచ్చారు. ఎన్టీఆర్ ‘ధమ్కీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా రాగా.. చరణ్ ఢిల్లీలో India Today Conclave ప్రోగ్రామ్‌కి హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో చరణ్ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆర్సీ 16 గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు రామ్ చరణ్. ఈ సినిమా షూటింగ్ ఎండింగ్ స్టేజ్‌లో ఉంది. నెక్స్ట్ సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుతో ఆర్సీ 16 అనౌన్స్ చేశాడు చరణ్. అప్పటి నుంచి ఈ సినిమా ఎలా ఉండబోతోంది.. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని.. ఎదురు చూస్తున్నారు మెగాభిమానులు. తాజాగా చరణ్ దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు. రంగస్థలంకి మించి ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇది ఇండియన్ మట్టి సినిమా అని.. వెస్ట్రన్ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని.. ఖచ్చితంగా తన కెరియర్లో మరో బెస్ట్ మూవీ అవుతుందని అన్నారు. అలాగే ఈ ఏడాది సెప్టెంబర్‌లో షూట్ మొదలుకానుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వాస్తవానికి.. రామ్ చరణ్ కెరీర్ ఒకసారి చూసుకుంటే.. సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ ముందు, ఆ తర్వాత అనేలా ఉంటుంది. చిట్టిబాబుగా చరణ్ నటను అంత ఈజీగా మరిచిపోలేం. ఈ సినిమాతో చరణ్ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇప్పటి వరకు చరణ్ చేసిన సినిమాల్లో కెరీర్ బెస్ట్ రోల్ చిట్టిబాబు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆర్సీ 16 అంతకు మించి
ఉంటుందని చెప్పడంతో.. ఇప్పటి నుంచే సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.