ఈ సారి ప్రభాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ అంతకుమించి అనేలా జరగబోతున్నాయి. ఇప్పటికే రెబల్ మూవీని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే బిల్లా, వర్షం సినిమాలను కూడా 4కెలో రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో మూడు రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలు జరగనున్నాయి. ఆ రోజు కొత్త సినిమాల అప్డేట్స్ కూడా ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు డార్లింగ్. దాంతో ఫ్యాన్స్ ఆ సమయం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఇక అక్టోబర్ 23న బిల్లా, వర్షం(varsham movie) సినిమాల స్పెషల్ షోలకు రంగం సిద్దమవుతోంది. అయితే ఇప్పుడు వర్షం రీ రిలీజ్ లేనట్టేనని తెలుస్తోంది. ఈ వారం నాలుగు కొత్త సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మంచు విష్ణు ‘జిన్నా’.. విశ్వక్ సేన్ ‘ఓరిదేవుడా’.. కోలీవుడ్ హీరో కార్తి ‘సర్ధార్’.. శివకార్తికేయన్ ‘ప్రిన్స్’ చిత్రాలు.. 21న థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే హాలీవుడ్ మూవీ ‘బ్లాక్ ఆడమ్’ కూడా రిలీజ్ అవుతోంది. దాంతో ఈ సినిమాలన్ని థియేటర్లు పంచుకోవాల్సి ఉంది.
అందుకే వర్షం సినిమాకు థియేటర్స్ అడ్జెస్ట్మెంట్ అవడం లేదని టాక్. దాంతో పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. కొన్ని టెక్నికల్ కారణాలు కూడా దృష్టిలో ఉంచుకొని.. వారం లేట్‌గా ‘వర్షం’ రిలీజ్ చేయాలని థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు కోరుతున్నారట. కానీ బిల్లా రీ రిలీజ్ మాత్రం ఉంటుందని టాక్. అయితే కల్ట్ క్లాసిక్ వర్షం అయితే ఫ్యాన్స్ రికార్డ్స్ క్రియేట్ చేయొచ్చని భావించారు. కానీ ఇప్పుడు వాళ్లకు నిరాశ తప్పేలా లేదంటున్నారు.