»Shahrukh Fans Are Too Much Attack On Prabhas Fans
Shahrukh ఫ్యాన్స్ అతి.. ప్రభాస్ ఫ్యాన్స్ పై దాడి ?
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క హిట్ పడితే చూడాలని ఎదురు చూస్తూనే ఉన్నారు రెబల్ స్టార్ అభిమానులు. సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. షారుక్‌తో బాక్సాఫీస్ వార్‌కు దిగాడు ప్రభాస్. ఇది ఇప్పుడు అభిమానులు కొట్టుకునే వరకు వెళ్లింది.
Shahrukh fans are too much.. Attack on Prabhas fans?
Shahrukh: ఇప్పటి వరకు జరిగిన బాక్సాఫీస్ క్లాష్‌లో ఈ వారం జరిగిన గొడవ మాత్రం పెద్దది. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ (Shahrukh), రెబల్ స్టార్ ప్రభాస్ మధ్య పీక్స్ ఆఫ్ ది వార్ నడుస్తోంది. హీరోల మధ్యే కాదు.. అభిమానుల మధ్య కూడా వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. సోషల్ మీడియాలో మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప అంటూ రెచ్చిపోతున్నారు. నార్త్‌లో సలార్ సినిమాకు థియేటర్లు తక్కువగా ఇచ్చారని తెలుస్తోంది. హిందీలో పీవీఆర్ ఐనాక్స్, మిరాజ్ సినిమాస్ సింగిల్ స్క్రీన్ డంకీకే ఇచ్చాయని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు.
సలార్ కంటే ఓ రోజు ముందే థియేటర్లోకి వచ్చింది డంకీ. ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వస్తోంది. సోషల్ మీడియాలో #SRKsDISASTERDONKEY అనే ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇది సోషల్ మీడియాకే పరిమితం కాలేదు. ఆఫ్‌లైన్‌లో కూడా ఫ్యాన్స్ కొట్టుకునే వరకు వెళ్లింది పరిస్థితి. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద పబ్లిక్ టాక్ సమయంలో ప్రభాస్ అభిమానులు డంకీ సినిమా బాగలేదని అనడంతో.. వారి మీద దాడికి యత్నించారు షారుక్ (Shahrukh) ఫాన్స్. వెంటనే సెక్యూరిటీ అలెర్ట్ అయి వారిని విడగొట్టారు. ఇప్పుడే ఇలా ఉంటే.. సలార్ రిలీజ్ అయ్యాక పరిస్థితి ఏంటనేది అర్థం కాకుండా ఉంది.
గతంలో ఆదిపురుష్ సినిమా సమయంలో ఐమాక్స్ దగ్గర గొడవ అయింది. దాని వల్ల గేటు దాటి రివ్యూ చెప్పే వాళ్ల కెమెరాలు లోపలికి రానివ్వడం లేదు. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అవుతోంది. షారుక్ ఫ్యాన్స్ ఏదైనా ఉంటే ముంబైలో చూసుకోవాలి.. లేదంటే ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్‌ను తట్టుకోవడం కష్టం అవుతుంది. అందుకే కాస్త అతి తగ్గించుకుంటే బెటర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయినా సినిమా బాగుంటే ఫ్యాన్స్ వల్ల ఆడదు కదా!