ELR: దెందులూరు మండలం పెరుగు గూడెం గ్రామం శివారు గోవిందపురంలో జరుగుతున్న కోడి పందాలపై ఆదివారం పోలీసులు దాడులు చేశారు. ఈ దాడిలో కోడి పందాలు నిర్వహిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.8,100 నగదు, 3 కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివాజీ తెలిపారు. మండల వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.