TG: హీరో అల్లు అర్జున్ అరెస్ట్‌ను ఖండిస్తూ BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్వీట్ చేశారు. కాగా KTRకు TPCC అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చదువుకున్న వాడివి, పదేళ్లు మంత్రిగా చేసినవాడివి చట్టం గురించి తెలియదా? అని నిలదీశారు. నేషనల్ అవార్డు విన్నరైనా, చివరకు KTR అయినా సరే తప్పు చేస్తే బొక్కలో ఉండాల్సిందేనన్నారు. ప్రజా ప్రభుత్వంలో ఎవరైనా చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు.