BPT: వేమవరం ప్రభుత్వ పాఠశాలను ఆదివారం సందర్శించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్, విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గంలో ఇప్పటివరకు 8 వేల మంది విద్యార్థులకు సైకిళ్లు అందించామని ఆయన తెలిపారు. పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.