భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిపారు. కేవలం తనకు బీసీసీఐ అందించే రూ. 30 వేల పెన్షన్ డబ్బులపైనే ఆధారపడుతున్నానని పేర్కొన్నారు. ‘కపిల్ దేవ్ ఆఫర్ను అంగీకరిస్తున్నా.. రిహాబిలిటేషన్ సెంటర్కు వెళ్లేందుకు నేను సిద్ధంగా ఉన్నా’ అని వెల్లడించారు. కాగా ఇటీవల కపిల్ దేవ్ తాను కాంబ్లీకి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నా.. కానీ అతడు రిహాబిలేషన్ సెంటర్కి వెళ్లాలని సూచించారు.