రైతు హీరా నాయక్ బేడీల ఘటనపై విచారణ ముగిసింది. సంగారెడ్డి సెంట్రల్ జైలులో నాలుగు గంటల పాటు ఐజీ సత్యనారాయణ విచారించారు. సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు ఐజీ తెలిపారు. హీరానాయక్ లగచర్లలో అరెస్టయితే.. బాలా నగర్ కేసులో అరెస్టయినట్లు జైలు రికార్డుల్లో నమోదైనట్లు గుర్తించారు. హీరా విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తప్పవని ఐజీ హెచ్చరించారు.