సిరియా అంతర్గత వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తెలిపారు. కానీ ప్రస్తుత పరిపాలకులు ఇరాన్ను బలపడేలా చేసి, హెజ్బొల్లాకు ఆయుధాలు అందిస్తే మాత్రం చర్యలు తప్పవని హెచ్చరించారు. తమ భద్రతే తమకు ప్రాధాన్య అంశమని, అందుకే సిరియన్ మిలటరీ వదిలివెళ్లిన స్థావరాలపై వైమానిక దాడులకు అనుమతిస్తున్నానని చెప్పారు. దీనివల్ల ప్రమాదకరమైన ఆయుధాలు జీహాదీల చేతుల్లోకి వెళ్లవని పేర్కొన్నారు.