VZM: పశు సంవర్దక శాఖ, జిల్లా పశుగణాభివృద్ది సంస్ద సంయుక్తంగా గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో భోగాపురం మండలం నందిగాంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు పశు వైద్యాధికారి యూ.రామరాజు తెలిపారు. పాడిపశువులకు గర్భకోశ వ్యాధులు, సాధారణ వ్యాధులను చికిత్స నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తామన్నారు. ఈ శిబిరాన్ని పాడి రైతులు వినియోగించుకోవాలని కోరారు.