KRNL: పత్తికొండకు చెందిన కళ్యాణి, రమేశ్ దంపతుల కుమారుడు చెన్నకేశవ జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. శనివారం విడుదలైన ఫలితాల్లో ఆలిండియా 206వ ర్యాంకు సాధించాడు. హైదరాబాద్లోని ఓ కళాశాలలో చదువుతున్న యువకుడు ఉత్తమ ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.