BNR: మోత్కూరు మండల పరిధిలోని అనాజిపురం-దాచారం గ్రామాల మధ్య ఉన్న పత్తి మిల్లు వద్ద ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుంగతుర్తి మండలం వెంపటి నుండి హైదరాబాద్ ద్విచక్ర వాహనం పైకి వెళ్తున్న వారిని అనాజిపురం నుండి వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టడంతో బైక్పై ఉన్న ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.