VZM: గజపతినగరంలోని అగ్నిమాపక కేంద్రంలో ఆదివారంతో వారోత్సవాలు ముగిశాయి. అగ్నిమాపక కేంద్రం అధికారి ఎం.ఎస్. వి. రవిప్రసాద్ అగ్ని ప్రమాదాలను నివారించే పరికరాలను ప్రదర్శనగా ఉంచి వాటి ఉపయోగాలను ప్రజలకు వివరించారు. వారం రోజులపాటు వివిధ రంగాల వారికి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో థియేటర్, గ్యాస్, పెట్రోల్ బంక్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.