TG: మహబూబ్నగర్ దేవరకద్రలో సుపారీ గ్యాంగ్ కలకలం సృష్టించింది. BJP నేత ప్రశాంత్ రెడ్డిని హత్య చేసేందుకు కుట్ర జరిగినట్లు తెలుస్తోంది. కర్నూల్, కర్ణాటకకు చెందిన రౌడీ షీటర్లు ఆయనపై రెక్కీ నిర్వహించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గతంలో ప్రశాంత్ రెడ్డి ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండగా.. రూ.2.5 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు ఓ ఆడియో వైరల్ అయింది.